SAKSHITHA NEWS

హైదరాబాద్‌: ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కన్నా మంగళ, బుధవారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దీంతోపాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రధానంగా బుధవారం కొన్ని జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సోమవారం సూర్యుడు నిప్పులుకక్కాడు. రాష్ట్రమంతటా మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన వేడితో జనం అల్లాడారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో 44.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ములుగు, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో అనేక మండలాల్లో 43 డిగ్రీల పైన నమోదయ్యాయి. హైదరాబాద్‌ మహానగరం పరిధిలోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రహదారులపై జనసంచారం తగ్గింది…….

WhatsApp Image 2024 04 16 at 11.48.02 AM

SAKSHITHA NEWS