జిల్లా కార్యదర్శి ఏజే రమేష్
సాక్షిత అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
రాష్ట్రంలో కార్మికుల సమస్యలు పరిష్కారం కానందు వల్లే పలు రంగాలకు సంబంధించిన కార్మికులు సమ్మెబాట పట్టారని కార్మికుల సమస్యలకు పరిష్కరం చూపకుండా సమ్మెను అణిచివేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ అన్నారు. అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె 19 వ రోజుకు చేరింది. సమ్మె శిబిరాన్ని సందర్శించి ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కార్మికుల బాధల తెలంగాణగా మారిందని అన్నారు.
తెలంగాణ ఏర్పడితే ధర్నాలే ఉండవని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సుదీర్ఘ కాలం కార్మికుల సమస్యలు పరిష్కారం కాక తెలంగాణ అంత ధర్నాలతో దద్దరిల్లుతుంది అని అన్నారు. అంగన్వాడీ ల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించక పోగ సమ్మె ను నిర్బంధం తో అణచివేయాలని చూస్తుందని అన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ల కు రూ10లక్షలు ఆయా లకు రూ ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ సిఐటియు మండల కన్వీనర్ కేసు పాక నరసింహారావు, కర్నాటి రాధ, ఉషా, నాగమణి, కృష్ణ వేణి,విజయ,రమణ, లక్ష్మి తదితరులు.