SAKSHITHA NEWS

The government has done a lot of good to the industrial sector

పారిశ్రామిక రంగానికి ఎంతో మేలు చేసిన ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు.


సాక్షిత : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పారిశ్రామిక రంగంపై ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పనితీరును, పారిశ్రామిక రంగాలకు, పారిశ్రామికులకు ప్రభుత్వం అందిస్తున్న సహాకారాన్ని గురించి వివరించారు.

•ఇండస్ట్రీ పరంగా ఆంధ్ర రాష్ట్రం గతంలో ఇండస్ట్రీలిస్ట్లు ఎన్నో సమస్యలను ఎదోర్కొన్నారని, గత ప్రభుత్వ హయంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రీలు పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు.

•గత ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రీలు పెట్టుబడులు పర్మిషన్లు పొంది బిజినెస్ చేసుకోవడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొనేవారని, ఎంతోదూరం ఎందుకు తానూ 2012 కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో గౌతమ్ బుద్ధ టెక్స్ టైల్ పార్క్ అనే పేరు మీద టెండర్ వేసి, రిజిస్టర్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుండి 40 కోట్ల రూపాయల సబ్సిడీని కూడా వచ్చిందని తెలిపారు.

•అయితే తరువాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నీకు 40 కోట్ల సబ్సిడీ వస్తున్నది కదా, మా నియోజకవర్గంలో నువ్వు ఇండస్ట్రీ పెడుతున్నావ్ కదా, మాకు అందులో 20 కోట్ల రూపాయలు వాటా ఇవ్వవలసినదిగా అప్పటి చిలకలూరిపేట మంత్రి తనని డిమాండ్ చేసారని, స్వయానా మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నన్ను ఇండస్ట్రీ పెట్టుకోమని చెప్పారని తెలిపిన కూడా అలా తన వాటా తనకు ఇవ్వకుండా ఇండస్ట్రీ పెట్టడం సాధ్యపడదని అన్నారని తెలిపారు.

•ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత తన ఇంటికి కొంతమంది ఆఫీసర్స్ ను నా ఇంటికి పంపించి నేను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేం పార్టీలో చేరితే నాకు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అనుమతులను ఇస్తామని అన్నారని తెలిపారు. దానికి నేను వ్యాపారం కన్నా కూడా నాకు నేను ఇచ్చిన మాటే నాకు ముఖ్యం అని వారికి తెలిపానన్నారు.

•దీని తర్వాత, నేను తెలుగుదేం పార్టీలో చేరేందుకు నిరాకరించడంతో ఇండస్ట్రీ పర్మిషన్స్ మీద ఒక కమిటినీ ఏర్పాటు చేసి సాక్షాత్తు చంద్రబాబు ఆ కమిటీకి చైర్మన్ గా ఉండి రిజిస్టర్ అయి ఉన్న తన గౌతమ్ బుద్ధ టెక్స్ టైల్ పార్క్ అనుమతులను రద్దు చేశారని, ఇదే చంద్రబాబు నైజం అని అన్నారు. ఈ రకంగా గత ప్రభుత్వం ఇండస్ట్రీస్ నుండి దోచుకుతింటూటే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించారు.

•గత ప్రభుత్వంలో చంద్రబాబు స్పిన్నింగ్ మిల్లులకు 200 కోట్ల సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చి, మాట తప్పారని ఆ కారణంగా మూతపడే పరిస్థితులలో ఉన్న స్ప్పిన్నింగ్ మిల్లులకు నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఆ 200 కోట్ల సబ్సిడీని వారి ఇచ్చి ఆదుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.

•గత ప్రభుత్వంలో పెట్టుబడులు కేవలం కాగితాల వరకే పరిమితమయ్యేవి అని, కానీ నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రరాష్ట్రంలో ఏర్పరుస్తున్న అనుకూల పరిస్థితులను చూసి నేడు ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు.


SAKSHITHA NEWS