SAKSHITHA NEWS

The district administration is always ready to help the disabled

దివ్యాంగులకు సహకరించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధం

26 మంది దివ్యాంగులకు “బ్రింగ్ఏ స్మైల్ ఫౌండేషన్” తరపున వీల్ చైర్లు పంపిణీ చేసిన……… జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్

సాక్షిత వనపర్తి
దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఎల్లవేళలా జిల్లా యంత్రాంగం సహకారం ఉంటుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
శనివారం స్థానిక వికలాంగుల పునరావాస కేంద్రంలో “బ్రింగ్ ఏ స్మైల్” ఫౌండేషన్ తరపున 26 మంది దివ్యాంగులకు వీల్ ఛైర్లు పంపిణీ చేయగా ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం ఎంతో గొప్ప విషయమని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఎల్లవేళలా జిల్లా యంత్రాంగం తరపున సహకారం అందిస్తామని తెలిపారు.
దివ్యాంగుల కోసం జిల్లాలోని 7 వికలాంగుల పునరావాస కేంద్రాలు (నైబర్ హుడ్ సెంటర్లు ) గొప్ప సేవలు అందిస్తున్నాయని ప్రశంసించారు. ఈ కేంద్రాల్ని బలోపేతం చేయడం కోసం అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు. కేంద్రాల్లో ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు.

   దివ్యాంగులకు చేయూత అందించడంలో భాగంగా నేడు బ్రింగ్ ఏ స్మైల్ ఫౌండేషన్ తరపున వీల్ ఛైర్ల పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. బ్రింగ్ ఏ స్మైల్ ఫౌండేషన్ కూడా ఎల్లప్పుడూ దివ్యాంగుల సేవలో ముందుంటుందని, వారి సేవలు ఎంతో గొప్పవని ప్రశంసించారు. వారి సేవలు రాబోయే కాలంలో కూడా ఇలాగే కొనసాగాలని సూచించారు. 

  కార్యక్రమంలో జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి నాగేంద్ర, అడిషనల్ డిఆర్డి ఓ భీమయ్య, బ్రింగ్ ఏ స్మైల్ ప్రతినిధులు రాజశేఖర్, వినోద్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, సెర్ప్, దివ్యాంగుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Image 2024 06 15 at 16.34.10 1

SAKSHITHA NEWS