దేవరంపాడు ఆలయ అభివృద్ధికి అవకాశం దేవుడిచ్చిన వరం
నూతన ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారంలో..
రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు
రాజుపాలెం
రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న దేవాలయాల్లోఏ అభివృద్ధి పనులు నిర్వహించాలన్న అటవీశాఖ అనుమతితోనే నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది అందువల్లనే అభివృద్ధి పనులు కొంత ఆలస్యమయ్యే పరిస్థితని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు అన్నారు. శనివారం నూతన ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ ప్రమాణ స్వీకారం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాత మండపాన్ని తొలగించి కొత్త మండపం నిర్మించి స్లాబు వేశాం. అలాగే రహదారి మార్గాన్ని సక్రమంగా ఏర్పాటు చేసి, మెట్లను కూడా పునఃనిర్మాణం చేసాం.. భక్తులు స్నానం చేసేందుకు స్నాన ఘాట్లను ఏర్పాటు చేశాం. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే ఆలయం అభివృద్ధి చెందుతుందన్నారు. శాఖమూరి శ్రీనివాసరావు ఆలయ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు వారి ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనులు కొనసాగాలని మంత్రి ఆకాంక్షించారు. గతంలో రూ. 20 లక్షల ఆదాయం ఉండేదని, ఇప్పుడు రూ. 70 నుండి 80 లక్షల వరకు ఆదాయం పెరిగిందని వివరించారు. భక్తుల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా వచ్చే నిధులను ఆలయ కమిటీ సక్రమంగా ఖర్చు చేస్తారని విశ్వసిస్తే నిధులు అత్యధికంగా వస్తాయని మంత్రి వివరించారు. భవిష్యత్తులో ఇక్కడ కళ్యాణ మండపం కూడా నిర్మించాలని ఆలోచిస్తున్నానని మంత్రి వివరించారు. నూతనంగా ఏర్పాటైన ధర్మకర్తల మండలి సభ్యులందరూ చిత్తశుద్ధితో ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం అటవీశాఖ అధికారి పలు ఉద్యానవనాలను నిర్మిస్తున్నట్లు మంత్రి అంబటికి వివరించారు.
కార్యక్రమంలో కమిటీ సభ్యులు, దేవాదాయ, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు