SAKSHITHA NEWS

తుడా టవర్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి.
పార్కుల నిర్వహణ మరింత మెరుగ్గా ఉండాలి.*
తుడా ఉపాధ్యక్షురాలు ఎన్. మౌర్య
..
సాక్షిత : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఆధ్వర్యంలో రాయల చెరువు రోడ్డు లో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, గడువులోపు పూర్తి చేయాలని తుడా ఉపాధ్యక్షురాలు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని రాయల్ చెరువు రోడ్ లో నిర్మిస్తున్న తుడా టవర్స్, బాబు జగ్జీవన్ రామ్ పార్కు, శ్రీనివాసపురం వద్ద గల పార్కును, సూరప్పకశం తుడా లేఔట్ ను, విమానాశ్రయం మార్గంలో సుందరీకరణ పనులను సోమవారం పరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 13 అంతస్థులతో తుడా టవర్స్ ను నిర్మిస్తున్నామని, అందులో రెండు అంతస్థుల్లో వాణిజ్య సముదాయాలకు, మూడు అంతస్థులు ఆఫీస్ ల వినియోగానికి, మిగిలిన అంతస్థుల్లో నివాస యోగ్యంగా నిర్మిస్తున్నామని ఇంజినీర్లు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలు మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అన్నారు.

నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులను నిత్యం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. జగజ్జివన్ రావ్ పార్క్ లోని మరుగుదొడ్లలో నీటి వసతి కల్పించాలని, వాకింగ్ ట్రాక్ సక్రమంగా ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరగా, వేంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శ్రీనివాసపురం పార్కు నిర్వహణ చక్కగా చేయాలని, ఎప్పటికప్పుడు మొక్కలను, గడ్డి కత్తిరించి పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయం వద్ద సుందరీకరణ పనులు పరిశీలించి, డివైడర్ల మధ్యలో రంగురంగుల పూల మొక్కలు నాటి సుందరంగా చేయాలని అన్నారు. ఉపాధ్యక్షురాలి వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, డి.ఈ. భాషా, ఉద్యానవన శాఖాధికారి మాలతి, ఏ.ఈ.షణ్ముగం, ఏ.పి.ఓ సూర్య నారాయణ, తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS