మహిళ ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్

Spread the love

The constable who saved the woman’s life

మహిళ ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్
-అభినందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,


సాక్షిత : సకాలంలో ప్రాథమిక చికిత్స అందించి ఓ మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,అభినందించారు .
వివరాల్లోకి వెళితే: ఫిబ్రవరి 24 వ తేదీన రాత్రి 8.30 గంటల సమయంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కే.రమేశ్ విధినిర్వహణలో భాగంగా హిమాయత్ సాగర్ సర్విస్ రోడ్ వద్ద వెళుతుండగా ఒ మహిళ అనుమానస్పదంగా కనిపించగా ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం చెప్పింది.

కాస్త ముందుకు వెళ్లిన కానిస్టేబుల్ అనుమానంతో వెన్నక్కి తిరిగి చూడగా నీటి చప్పుడు వినిపించిది. దాంతో ఆత్మ హత్య కు పాల్పడిన మహిళను కానిస్టేబుల్ నీటిలో దూకి మహిళను కాపాడి ఒడ్డుకు చేర్చాడు.స్థానికుల సహాయం తో ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడాడు.ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు.
సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి నారాయణ్ నాయక్, ఐపిఎస్., రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి సమక్షంలో సైబరాబాద్ సీపీ కానిస్టేబుల్ ను అభినందించి రివార్డు అందజేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page