రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన
ముగ్గురు కీలక నాయకులు ఉన్న ప్రాథమిక సౌకర్యాల కల్పనలో మున్సి, పాలకులు ఘోర విఫలం
సింగిల్ విండో (డిసిసి బి) దుకాణాల కిరాయిల అక్రమాల పైవిచారణ జరపాలి………… బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నూరు రవీందర్*
సాక్షిత వనపర్తి :
గత బిఆర్ఎస్ పాలన పై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నమ్మి అధికారాన్ని కట్టబెడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాలన లోరాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చారని భారతీయ జనతా పార్టీరాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నూరురవీందర్ ఘాటుగా విమర్శించారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి రాష్ట్రంలోప్రతి రైతుకురెండు లక్షల రుణమాఫీ చేస్తామని మొత్తం 33 వేల కోట్లు రుణ భారం ఉంటుందని ప్రస్తుతం మూడు విడతల్లో 18 వేల కోట్లు మాత్రమే బ్యాంకర్లకు చెల్లించి మిగతా 17 వేల కోట్లు వివిధ కారణాల తో కొర్రీలు పెట్టి చెల్లించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టివిక్రమార్కులకు చిత్తశుద్ధి ఉంటే నిరుపేద ప్రతి రైతుకు రుణమాఫీ చేసి రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని సవాల్ విసిరారు రుణమాఫీ పై ప్రభుత్వం చెబుతున్నది ఒకటి క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి అని దీంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
ధరణిలో రైతులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని చెప్పి ధరణి ఆర్ వో ఆర్ పై ఇంతవరకు క్లారిటీ లేదని అలాగే మహిళలకు ₹2,500 రూపాయల పెన్షన్ తదితర హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందనివారు విమర్శించారు. ప్రభుత్వ పాలనలో నియోజకవర్గం నుండి ముగ్గురు నాయకులు ఒకరు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా చిన్నారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా శివసేన రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా మెగారెడ్డిలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నప్పటికీ వనపర్తి అభివృద్ధి ఒక్క అడుగు ముందుకు వెయ్యకపోగా మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు మంచి నీరు, రోడ్ల సౌకర్యం, వీధి దీపాలు, ఏర్పాటు చేయడంలో సీజనల్ వ్యాధులైన డెంగు మలేరియా వంటి వ్యాధుల అరికట్టడంలో మున్సిపాలిటీ పాలకులు అధికారులు ఘోరంగా విఫలం చెందుతున్నారని సమస్యలు ఉన్నాయని ఫోన్ చేస్తే కనీసం స్పందించకపోవడం దారుణమని అన్నారు పలు సమస్యలపై అధికారులపై జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
భాజపా జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు నాగర్ కర్నూల్ పార్లమెంటు కో కన్వీనర్ ప్రవీణ్ లుమాట్లాడుతూ వనపర్తి పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎదురుగా ఉన్న సింగిల్ విండో( డిసిసిబి ) 22 దుఖానాల అద్దె వసూళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇదే విషయంలో బిజెపి ఆధ్వర్యంలో పలుమార్లు నిరసనలు తెలపడం జరిగిందని అద్దెలపై (డిసిసిపి) జిల్లా కో-ఆపరేటివ్ ఆధ్వర్యంలో విచారణ చేయాలని లేకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు తప్పవని ఈసందర్భంగా హెచ్చరించారు
నేడు రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రమదేవి వనపర్తి కి రాక నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా అధికార పార్టీ రుద్రమదేవి వనపర్తి కి విచ్చేయున్నారని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా చేపట్టనున్నారని నాయకులు కార్యకర్తలు పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రకార్యవర్గ సభ్యులు మున్నూరు రవీందర్, జిల్లా అధికార ప్రతినిధిపెద్దిరాజు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ కో కన్వీనర్ ప్రవీణ్లు విజ్ఞప్తి చేశారు.