మూసి ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత రైతులకు శుభవార్త..
ఈ నెల 16 నుంచి మూసీ ఎడమ కాలువకు నీటి విడుదల
సాక్షిత ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో
నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం కలగనుంది. ఈ నెల 16వ తేదీ నుంచి మూసీ ప్రాజెక్టు ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ మధు ఒక ప్రకటనలో తెలిపారు. ఎడమ కాలువ పరిధిలోని రైతులు నీటి వినియోగానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. కాలువ ద్వారా నీరు అందుబాటులోకి రావడంతో ఆయకట్టు ప్రాంతంలోని పంటలకు సాగునీరు అందడంతో పాటు రైతులకు ఎంతో ఊరట లభించనుంది. నీటి విడుదలతో వరి, ఇతర పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
