మొబైల్‌ యాప్స్‌ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది

SAKSHITHA NEWS

ఢిల్లీ: మొబైల్‌ యాప్స్‌ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది. దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్‌ మెసేజింగ్‌ యాప్‌లను బ్లాక్‌ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ యాప్‌ల ద్వారా ఉగ్రవాదుల, ఉగ్రవాదుల మద్దతుదారులకు నడుమ కమ్యూనికేషన్‌, క్షేత్రస్థాయిలో దాడుల ప్రణాళికల చేరవేత, మరీ ముఖ్యంగా పాకిస్తాన్‌ నుంచి సూచనల రాకపోకలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రత్యేకించి జమ్ముకశ్మీర్‌లో ఈ యాప్‌ల వినియోగం ఎక్కువగా ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలో..

కేంద్రం 14 మెసేజింగ్‌ యాప్‌లను బ్లాక్‌ చేస్తున్నట్లు తెలిపింది. క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్రమ్Wickrme, మీడియాఫైర్, బ్రియార్, బీఛాట్‌, నంద్‌బాక్స్‌, కోనియన్‌, ఏఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా యాప్‌లను బ్లాక్‌ చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం.

భద్రతా, నిఘా వర్గాల రికమండేషన్‌ మేరకు.. ఐటీ యాక్ట్‌ 2000 సెక్షన్‌ 69ఏ ప్రకారం ఈ నిషేధం అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అంతేకాదు.. ఆయా యాప్స్‌ ప్రతినిధులెవరూ భారత్‌లో లేరని నిర్ధారించుకుంది. మెసేజింగ్‌ యాప్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఓ ప్రకటనలో కేంద్రం కోరింది.


SAKSHITHA NEWS

sakshitha

Related Posts

rahul తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSrahul తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాసేపు తాపీమేస్త్రి అవతారం ఎత్తారు. భవన నిర్మాణ కార్మికులతో కలసి పార, తాపీ పట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ…


SAKSHITHA NEWS

world ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSworld ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇప్పటికే మూడు రథాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఈనెల 7న ప్రారంభమై 16…


SAKSHITHA NEWS

You Missed

ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు

ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

You cannot copy content of this page