విజయవాడ
ఐదున్నరేళ్ళుగా జైలులో మగ్గుతున్న కోడి కత్తి శ్రీనివాసరావును బెయిల్ మంజూరు కూడా చేయకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని పలు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు శుక్రవారం ఏపీ గవర్నర్ నజీర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
కోడి కత్తి కేసు సంఘటనతో పాటు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని పూర్తి వివరాలను తెలియజేశారు.
రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ లపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాల సంఘటనలను కూడా వివరించారు.
గవర్నర్ సావధానంగా అన్ని అంశాలను విన్నారు.
తెలుగు దేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య, జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్, సిపిఐ పార్టీ నాయకులు బోడేపూడి శంకర్, మైనారిటీ నాయకులు షుబ్లీ, అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య, సమతా సైనిక సురేంద్ర, పింకీ, మాలమహానాడు నాయకులు, శ్రీను తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు ఉన్నారు.