court కోర్టు ఆదేశాలిచ్చింది.. అధికారులు అమలుచేయడం లేదు
నీళ్లు, కరెంటు లేక ఏడేండ్లుగా కాలనీ వాసుల తీవ్ర ఇబ్బందులు
ఏడేండ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించండి
జిల్లా మంత్రులు, అధికారులు మా సమస్యలకు పరిష్కారం చూపండి
విలేకరుల సమావేశంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తాళ్లూరి కృష్ణ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
ఖమ్మం జిల్లా అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ వినోబా నవోదయ కాలనీ ప్రజలకు కనీస వసతులు నీళ్లు, కరెంటు కల్పించమని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు పరిష్కరించడం లేదని నూతన ప్రభుత్వంలోని జిల్లా మంత్రులు మా సమస్యలను పరిష్కరించాలని గ్రామీణ పేదల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తాళ్లూరి కృష్ణ కోరారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… గత ఐడేండ్లుగా ప్రత్యక్ష పోరాటం చేస్తున్న క్రమంలో హైకోర్టు వారి నుండి మంచి నీళ్ళు, కరెంట్ తో పాటు కనీస వసతులు కల్పించమని ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు అమలుచేయడంలేదన్నారు. ఆ సమస్యల పరిష్కారం కొరకు స్థానిక కలెక్టర్ వారి కార్యాలయంకు కాలనీ ప్రజలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేసేందుకు పోలీస్ వారు అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
జిల్లా కలెక్టర్ కు హైకోర్టు ఉత్తర్వులతో పాటు మా సమస్యలను చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని, లేదా స్వయంగా కలెక్టర్ కాలనీని సందర్శించి సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. గత ఏడేండ్లుగా పోరాడి ఇండ్ల స్థలాలు సాదించుకొని జీవనం కొనసాగిస్తున్నామని, కరెంట్, నీళ్లు కనీస వసతులు లేక పిల్లలతో కఠిక చీకటిలో దుర్భర జీవితం గడుపుతున్నామని జిల్లా మంత్రులు, నూతన జిల్లా అధికారులు మా సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా కమిటీ సభ్యులు కొప్పెర వెంకన్న, గ్రామీణ పేదల సంఘం జిల్లా కమిటీ సభ్యులు మంకిడి లింగరాజు, షేక్ అక్తర్ ఉన్నిషా బేగం, దంతోజు సంధ్య తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app