The aim is to bring out the players in the rural areas
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీయడమే నాలక్ష్యం
బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
సాక్షిత న్యూస్, మంథని:
పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కెపూర్ గ్రామం లో యువ నాయకులు మేదరవేన రవి కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిధి బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి బహుమతులు అందజేశారు. చివరి మ్యాచ్ లో తోట గోపయ్య పల్లి, లక్కెపూర్ జట్లు తలపడగా విన్నర్ తోట గోపయ్య పల్లి జట్టు కు 5000 రు” రన్నర్ లక్కెపూర్ జట్టు కు 2000 రు లను అందించడం జరిగింది క్రికెట్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి సునీల్ అన్న మాట్లాడుతు.. క్రీడాలు మానసిక, శారీరకంగా ఎంతగానో ఉపయోగపడతాయి, యువత చదువుతో పాటు, ఆటలో కూడ రాణించాలి,12 సంవత్సరాలు గా ఈ ప్రాంతం మార్పు కోరకు పరితపిస్తున్న, నాకు అవకాశం వస్తే
హైదరాబాద్ తరహాలో మంథని ప్రాంతంలో క్రీకెట్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేస్తానని,
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడం కోసమే క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మండల ఇంచార్జ్ లు చిలువేరి సతీష్, తోట మధుకర్, మంథని పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.