టి.జీ.ఎస్.ఆర్.టి.సి లాజిస్టిక్ సేవలు ఇక ఇంటి వద్దకే
.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;
వినియోగదారుల పార్సల్స్ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వేగంగా, భద్రంగా చేరవేస్తూ అనేక ప్రశంసలు అందుకుంటూ ముందుకు వెళుతున్న టి.జీ.ఎస్. ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు మరొక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లో ఎంపిక చేయబడిన 31 ప్రాంతాలకు ఇంటి వద్దకే వినియోగదారుల పార్సల్స్ను చేరవేయుటకు సిద్ధమైంది.
వినియోగదారులు బుకింగ్ సమయంలో పూర్తి చిరునామా మరియు పిన్కోడ్ ను కచ్చితంగా తెలియజేస్తూ హోం బుకింగ్ అని చెప్పి బుకింగ్ చేసుకోవలెను. ఈ విధంగా బుకింగ్ చేసిన పార్సల్స్ను ఇంటి వద్దకే డెలివరీ ఇవ్వబడును. కావున వినియోగదారులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోగలరని మనవి.
ఇట్టి కార్యక్రమంను ముందుగా హైదరాబాద్ లో ప్రారంభించి తరువాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింప చేయాలని యోచిస్తున్నది అని ఉమ్మడి వరంగల్ మరియు ఖమ్మం ఏటీఎం ఏ పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.