దేశం లోనే అతి పెద్ద పార్టీ బీజేపి – బీజేపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి
కమలాపూర్ సాక్షిత:
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో ఉప్పల్ పల్లి,ఉప్పల్,కమలాపూర్, గూడూరు, శ్రీరాములపల్లి, మదన్నపేట్, శనిగరం,మర్రిపల్లిగూడెం గ్రామాల్లో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించామని ఆయన అన్నారు. కమలాపూర్ మండలం ముందుండాలని , దేశంలోనే భారతీయ జనతా పార్టీ అత్యధికంగా సభ్యత్వాలు కలిగిన పార్టీ అని ఆయన గుర్తు చేశారు. కమలాపూర్ మండలంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బిజెపి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతం రెడ్డి కమలాపూర్ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి భూపతి ప్రవీణ్ మరియు నరేడ్ల ప్రవీణ్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.