“సింగరేణి మారుపేర్ల సమస్యపై ఉద్రిక్తత – లక్క శ్రావణ్ గౌడ్ ముందస్తు అరెస్ట్…”
సాక్షిత పెద్దపల్లి//రామగుండం:
భూపాలపల్లి పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు సింగరేణి మారుపేర్ల సమస్యపై నిరసన వ్యక్తం చేయనున్న నేపథ్యంలో సింగరేణి డిపెండెంట్ లక్క శ్రావణ్ గౌడ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
సింగరేణి ఆధారిత కుటుంబాల సమస్యలపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగే అవకాశముందని భావించిన పోలీసులు జాగ్రత్త చర్యగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా లక్క శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ, ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు. మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి ఆధారిత కుటుంబాలు భారీ స్థాయిలో నిరసనలు చేపడతాయని హెచ్చరించారు.
ముందస్తు అరెస్టు అయిన వారిలో పర్తపల్లి హరీష్, దన్నాడ రాజు, రమ్మిండ్ల సందీప్, డొమ్మెటి రాజు, అవుల రవి, ఓంప్రకాశ్, పొన్నం వెంకటేష్, వెంకట్ లియో, తిరుమల శ్రీనివాస్, డిష్ బాబు ఉన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY