తల్లి-శిశు ఆరోగ్య సేవల్లో సాంకేతిక విధానాలకు ప్రాధాన్యం…
ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ …
గర్భిణీలు, శిశువుల వివరాల నమోదుపై అవగాహన కల్పించిన జిల్లా వైద్యాధికారి డా.కె.ప్రమోద్ కుమార్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమగ్ర జిల్లా అధికారుల సముదాయ భవనంలోని చిన్న సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. ప్రమోద్ కుమార్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రులు గర్భిణీ స్త్రీల వివరాలు, నవజాత శిశువులకు అందించే టీకాల సమాచారాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ నమోదు విధానంలో నమోదు చేయాలని సూచించారు. తల్లి-శిశు ఆరోగ్య పరిరక్షణలో సాంకేతిక విధానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
నమోదు విధానం, వివరాల నమోదు పద్ధతి, సాంకేతిక అంశాలపై ఆసుపత్రుల సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని కార్యక్రమ అధికారి డా. బి. కిరణ్ కుమార్ మరియు సంబంధిత సిబ్బంది నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమ అధికారి డా. బి. శ్రీరాములు పాల్గొనగా, జిల్లాలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బంది హాజరై శిక్షణ పొందారు.
