ప్రజల మధ్యకే ప్రజాప్రతినిధి… వీర్లపల్లిలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విస్తృత పర్యటన …

Sakshitha news

ప్రజల మధ్యకే ప్రజాప్రతినిధి… వీర్లపల్లిలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విస్తృత పర్యటన …

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని: పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ 21వ. డివిజన్ పరిధిలోని వీర్లపల్లి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీల్లో పాదయాత్ర నిర్వహిస్తూ స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు, అవసరాలు, అభివృద్ధి పనులపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా ప్రతి వార్డులో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు. రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రతి కాలనీకి మౌలిక సదుపాయాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. పట్టణ ప్రగతి ప్రణాళిక ద్వారా వార్డుల వారీగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చి రహదారులు, మురుగు కాలువలు, తాగునీటి సౌకర్యాలు, పార్కులు, విద్యుత్ సదుపాయాలు తదితర మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, ఉప మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top