SAKSHITHA NEWS

సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత?

హైదరాబాద్:
హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీసారంటూ.. మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థునీలు ఆందోళనకు దిగారు.

హాస్టల్లో పనిచేసే సిబ్బంది విద్యార్థులను అసభ్యంగా వీడియో తీశారని ఆరో పిస్తూ రాత్రి ఆందోళన చేపట్టారు. సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ లో స్నానాల గదిలో వీడియోలు తీశారని ఆరోపిస్తూ….

రాత్రి విద్యా ర్థులు ఆందోళన చేపట్టిన. విద్యార్థినీలకు విద్యార్థి సంఘాలు బాసటగా నిలిచాయి. నిందితులపై చర్యలు తీసుకుంటామని, హామీ ఇచ్చేంతవరకు ఆందో ళన విరమించేది లేదని హాస్టల్ బయట బైఠాయించారు.

ఈ ఘటనపై ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, స్పందించారు. హాస్టల్ ఉద్యోగుల వద్ద స్వాధీనం చేసుకున్న11 సెల్ ఫోన్లో లో అభ్యంతకర వీడియోలు ఏమీ లేవని, స్పష్టం చేశారు. వీడియోలు రికార్డ్ చేసినట్లు కుడా ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

అటు కాలేజీ విద్యార్థులు ఉదయం మరోసారి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది, వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.


SAKSHITHA NEWS