Telugu nation Ilavelupu, deathless birth universally famous Dr. Nandamuri Taraka Rama Rao
సాక్షిత : తెలుగుజాతి ఇలవేలుపు, మరణం లేని జననం విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు 27 వ వర్థంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ఆ మహానుబావుడి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు అని తెలియజేసారు. అదేవిదంగా ఎంతో మందికి ఆయన స్ఫూర్తి ప్రదాత అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని
మరణం లేని జననం.
తెలుగువాడి కీర్తిని నలుదిశలా ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, కాశినాథ్ యాదవ్,గుడ్ల శ్రీనివాస్, వాసుదేవరావు,కిషన్, మున్నా, కాజా,శివ,బాల స్వామి,మల్లేష్,కుర్మయ్య, బాలరాజు, రాజీవ్ ,రాజ్ పటేల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.