SAKSHITHA NEWS

తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా 124 డివిజన్ ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఎల్లమ్మబండ మరియు జయశంకర్ కాలనీలలో గల జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమంలో పాల్గొని తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.సి.ఆర్ కి మార్గదర్శిగా మరియు సలహాదారుగా వెన్నంటే నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు మన అందరికి ఆదర్శం అని, ఆయన కోరుకునట్లే కె.సి.ఆర్ మరియు కె.టి.ఆర్ ఆధ్వర్యంలో తెలంగాణా అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తెలియచేశారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్ మరియు కాశినాథ్ యాదవ్, ఎస్.సి సెల్ అధ్యక్షులు జాన్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, వాసుదేవరావు, రామస్వామి, జగదీష్, సంగమేష్, వెంకటేష్, రవీందర్, వాలి నాగేశ్వరరావు, మౌలానా, రేణుక, సురేఖ, సంతోష్, ఉమేష్, యలమంద, కృష్ణ, శంకర్, వెంకటకృష్ణ, ఫజల్, ప్రసాద్, బాబూరావు, పండు, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.