ఆహార పంటల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ
ఆహార పంటల ఉత్పత్తిలో 16.42 శాతం వృద్ధి రేటును సాధించిన తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద వ్యవసాయ రాష్ట్రాలను వెనక్కి నెట్టి మేటి అనిపించుకున్నది. 2018-19 నుంచి 2023-24 వరకు వ్యవసాయరంగంలో వివిధ రాష్ట్రాలు సాధించిన వృద్ధిరేటు పై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. మహారాష్ట్ర 7.11 శాతం వృద్ధి రేటుతో రెండవ స్థానంలో నిలిచింది.