తెలంగాణ గురుకులాలు దేశానికే తలమానికం.

Spread the love

తెలంగాణ గురుకులాలు దేశానికే తలమానికం.
సీఎం కేసీఆర్ పాలనలో దళిత,గిరిజన విద్యార్థులకు పెద్దపీట.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో విద్య.
ట్రైబల్ వెల్ఫేర్ మరియు సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు సమ్మర్ క్యాంపుతో పాటు సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ నిర్వహణ.
పోస్టర్ లు లాంచ్ చేసిన మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్.
అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ COE CET 2023 ఫలితాలను మంత్రులు విడుదల చేసారు.
ఏప్రిల్ 22 నుండి మే6 తారీకు వరకు సమ్మర్ క్యాంప్స్


సాక్షిత : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు ఇది ఒక స్వర్ణయుగమని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు 91 గురుకులాలు ఉంటే ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు అదనంగా మరో 94 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గురుకులాలను స్థాపించడమే కాదు పిల్లలకు అన్ని రకాల సదుపాయాలతో నాణ్యమైన ప్రమాణాలతో విద్యను అందించడం జరుగుతుందన్నారు. దీంతో గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా గురుకులల్లో చదివే విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో, ఎన్ఐటీ విద్యాసంస్థల్లో సీట్లు పొందుతున్నారని స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం మన గురుకులాల్లో అడ్మిషన్లు పొందడానికి ప్రవేశ పరీక్షలు రాసే వారి సంఖ్య పెరుగుతూనే ఉందని, విద్యతో పాటు వివిధ రంగాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వంతో పాటు పలు సంస్థలతో భాగస్వామ్యం చేపట్టి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు.

ప్రతి ఏడాది గురుకులాల్లో విధిగా సమ్మర్ క్యాంప్స్ నిర్వహించటం జరుగుతుందని, అయితే కోవిడ్ కారణంగా గత మూడు సంవత్సరాలు సమ్మర్ క్యాంప్స్ నిర్వహించలేకపోయామన్నారు. ఈ సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ సమ్మర్ క్యాంపులు రూపుదిద్దుకుంటున్నాయని, మొత్తం 45 చోట్ల సమ్మర్ క్యాంప్స్ నిర్వహణకి కసరత్తు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి కేంద్రంలో 100 మంది గిరిజన విద్యార్థులు మరియు వందమంది సాంఘిక సంక్షేమ విద్యార్థులు పాల్గొంటారన్నారు. 15 రోజుల పాటు జరిగే ఈ సమ్మర్ క్యాంప్స్ ఏప్రిల్ 22న ప్రారంభమై మే నెల ఆరవ తారీకు వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులకు సంగీతం, నాట్యం ,పెయింటింగ్, రేఖా చిత్రం ,చిత్రలేఖనం ,భాష నైపుణ్యాలు ,వాయిద్యాలు, కోడింగ్, డ్రోన్ తయారు చేయుట, క్రికెట్ కామెంట్రీ, వ్యక్తిత్వ వికాసం, బొమ్మల తయారీ ,ఆర్టిఫిషియల్ నగల తయారీ( జువెలరీ మేకింగ్) వంటి అంశాలలో మెలకువలు నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఇంతే కాకుండా క్రీడలు కూడా సమ్మర్ క్యాంప్స్ లో ఒక భాగమే కాబట్టి చెస్, క్రికెట్ ,బాస్కెట్బాల్ వంటి వివిధ క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామన్నారు. 15 కేంద్రాలలో జరిగే స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్స్ కూడా ఏప్రిల్ 26న ప్రారంభమవుతాయి ప్రతి క్యాంప్ లో కూడా 30 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
సుమారుగా 900 మంది విద్యార్థులకు క్రీడల సమ్మర్ క్యాంపులో పాల్గొనే అవకాశాన్ని కల్పించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ చెస్ అకాడమీ చాలా అద్భుతంగా నిర్వహించబడుతుంది. ఈ అకాడమీ నుంచి సుమారుగా 50 మంది విద్యార్థులు ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 30వ తారీకు వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోజరిగే చదరంగం పోటీలకు గురుకులం తరఫున పాల్గొనబోతున్నారు .వీరిలో 25 మంది బాలికలు మరియు 25 మంది బాలురు గలరు . ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే ఈ సమ్మర్ క్యాంప్స్ ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ మంత్రి సూచించారు.

అనంతరం సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ COE CET – 2023 ఫలితాలను మంత్రులు విడుదల చేశారు. ప్రతిష్టాత్మకంగా నడిచే ప్రతిభా కళాశాలలకు గాను మార్చి 12న ప్రవేశ పరీక్ష జరిగిందని, 15 గిరిజన ప్రతిభా కళాశాలలు రాష్ట్రంలో నిర్వహించబడుతున్నాయన్నారు. 160 మార్కులకు గాను నిర్వహించబడిన ఈ పరీక్షకు మొత్తం 13వేల 573 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1140 మంది సీట్లు పొందారని మంత్రి తెలిపారు.
వీరిలో MPC బాలురు మరియు బాలికలు కలిపి 575 మంది సీటు సాధించారు BPC లో 565 మంది విద్యార్థులు సీట్లు పొందడం జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఎంపీసీ కేటగిరిలో రమావత్ అరుణ్ 116 మార్కులతో మొదటి స్థానంలో ఉండగా, ఏ శ్రవణ్ కుమార్ 109 మార్కులతో రెండవ స్థానం కైవసం చేసుకున్నాడు. మూడవ స్థానంలో లకావత్ అశోక్ 107 మార్కులు సంపాదించాడు.
బైపీసీ కేటగిరి లో పత్లావత్ సందీప్ మరియు బానోత్ జయశ్రీ 117 మార్కులతో మొదటి రెండు స్థానాలు కైవసం చేసుకోగా, భానోత్ దిలీప్ 112 మార్కులతో మూడవ స్థానం దక్కించుకున్నాడు. MPC బాలురు మరియు బాలికలు కలిపి 575 మంది సీట్లు సాదించారు. BPC లో 565 మంది సీట్లు పొందడం జరిగిందని అంన్నారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి కృషిచేసిన అధికారులను ఉపాధ్యాయులను సిబ్బందిని మంత్రి అభినందించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్

గురుకుల విద్యా విధానం లో సీఎం కేసీఆర్ వినూత్న ప్రక్రియాకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఎస్సి అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ యల్ గురుకుల పాఠశాలలకు సంబంధించి COE సెట్
పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సందర్బంగా మంత్రి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత గురుకుల విద్యా సంస్థలు మెరుగు పడ్డాయన్నారు. ప్రైవేట్ పాఠశాల లకు దిటుగా అడ్మిషన్ల కోసం పోటీ పడుతున్నారని చెప్పారు. తల్లి దండ్రుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు
గురుకుల ల్లో చదివిన ఎందరో విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. సీ ఓ ఈ సెట్ పరీక్ష లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు.. వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, విద్యా బోధన చేసిన ఉపాధ్యయులను మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ యల్ గురుకుల పాఠశాలలకు సంబంధించి COE సెట్ 2023 పరీక్ష లో 3680 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మొత్తం 82 వేల 530 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 77 వేల 399 మంది వ్రాత పరీక్ష కు హాజరయ్యారన్నారు.
కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక్ స్కూల్ల్లో 160 ఖాళీలకు గాను పరీక్ష నిర్వహించగా 9495మంది ధరఖాస్తు చేసుకున్నారు.8498 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 410 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో 160 మందిని సెలెక్ట్ అయ్యారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెసిడెన్సీ యల్ విద్యా సంస్థల సోసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ,ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page