SAKSHITHA NEWS

రూ.319 కోట్లతో సురక్షిత మంచీనీరు.. ప్రతీ రోజు నిర్విఘ్నంగా ప్రతీ గడపకు…
2014కు ముందు…
గొంతు తడుపుకోవడానికి అష్ట కష్టాలు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నాటి మంచినీటి గోస వర్ణనాతీతం. ప్రజలకు సురక్షితమైన తాగునీరు లేక కలుషిత నీరు తాగి రోగాల బారిన పడిన దుస్తితి. భూగర్భ జలాలు ఎండిపోయి, నీరు అందకపోయేది. కరెంటు లేకపోవడం వల్ల నీటి పంపింగ్‌ సాధ్యపడకపోయేది. మోటార్లు, బోర్లు పాడవడం వల్ల నీటి సరఫరా నిలిచిపోయేది. వానలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నల్లాలు బంద్‌ అయ్యేవి. ఎప్పుడో ఓ సారి వచ్చిన కొద్దిపాటి నీళ్లు అందరికీ సరిపోకపోయేవి. నల్లా దగ్గర బిందె యుద్ధం జరిగేది. మహిళలు నీళ్లు తెచ్చుకుని వాటినే రోజంతా పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఉండేది.
2014 తర్వాత…
గడప గడపకు సురక్షిత త్రాగు నీరు…

సురక్షిత మంచీనీరు ప్రతీ రోజు నిర్విఘ్నంగా ప్రతీ గడపకు అందించాలనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన మిషన్‌ భగీరథ పథకం ద్వారా రూ.319 కోట్లతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించాం.
నాడు.. నేడు…

నాడు సరఫరా పరిమాణం 60.55 MLD మాత్రమే. నేడు సరఫరా పరిమాణం 137.30 MLD. పెరిగిన సరఫరా పరిమాణం 76.65 MLD.
నాడు నీటి సరఫరా కనెక్షన్లు.. 58,862 మాత్రమే కాగా, నేడు నీటి సరఫరా కనెక్షన్లు 1,00,166. అందించిన కొత్త కనెక్షన్లు 57,304.
నాడు నీటి సరఫరా పైప్‌లైన్ పొడవు కేవలం.. 372.38 కి.మీ. కాగా, నేడు నీటి సరఫరా పొడవు 845.17 కి.మీ. కొత్త పైప్‌లైన్ లు 472.79 కి.మీ ఏర్పాటు చేశాం.
నాడు మొత్తం రిజర్వాయర్లు కేవలం 41 సంఖ్య మాత్రమే. నేడు మొత్తం రిజర్వాయర్లు
63, కొత్త రిజర్వాయర్లు 22.
నాడు మొత్తం రిజర్వాయర్ల సామర్థ్యం 24.35 ML మాత్రమే.. నేడు మొత్తం రిజర్వాయర్ల సామర్థ్యం 63.93 ML. కొత్తగా 39.58 ML సామర్ధ్యాన్ని పెంచాం.
నాడు ఒక్క రూపాయి నీటి సరఫరా కనెక్షన్లు లేవు, నేడు అందించిన ఒక రూపాయి మరియు BPL హౌస్ సర్వీస్ కనెక్షన్లు 31,954.
నాడు ఉచిత నీటి సరఫరా ప్రజలకు అందించలేదు, నేడు 20KL ఉచిత నీటి సరఫరా అందిస్తున్నాం. అన్ని మురికివాడలు, గృహ వ్యక్తులు, అపార్ట్‌మెంట్‌లు మరియు గేటెడ్ కమ్యూనిటీలను కవర్ చేస్తూ 80 వేల కనెక్షన్లు ఉంటే దాదాపు 46,111 కనెక్షన్‌లు ఉచిత నీటి సరఫరా ప్రయోజనం పొందుతున్నాయి. అంటే 50% ఉచితంగా అందిస్తున్నాం. ఇందుకు రాయితీ దాదాపు రూ.49.27 కోట్లు ఇప్పటి వరకు. భూగర్భజలాలు మెరుగుపర్చేందుకు 105 ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశాం. రోజు సెప్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

మురుగునీటి శుద్ధీకరణ…

నాడు మురుగునీటి నెట్‌వర్క్ పొడవు 350కిలోమీటర్లు మాత్రమే.. నేడు ప్రస్తుత మొత్తం మురుగునీటి నెట్‌వర్క్ 610 కి.మీ. పెంచుతూ పొడవు సుమారు 260 కి.మీ. నాడు మురుగునీటిని శుభ్రపరిచే యంత్రాలు 10 మాత్రమే పని చేసేవి.. నేడు ఆపరేషన్‌లో ఉన్న మురుగునీటి శుభ్రపరిచే యంత్రాలు 13.. అంటే 3 యంత్రాలను పెంచాము. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం మాన్యువల్ క్లీనింగ్ నిషేధించబడింది, యాంత్రికంగా జెట్టింగ్ మెషిన్ ల ద్వారా శుభ్రపరచడం జరుగుతుంది. నాడు చెరువులు కలుషితం కాకుండా కాపాడేందుకు ఒక్క STP నిర్మించలేదు. నేడు రూ.214.02 కోట్లతో 5 STPలు 66 MLD సామర్థ్యంతో నిర్మించడం జరుగుతుంది. వంద శాతం మురుగునీటిని శుద్ధికరించడం కోసం ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ లను నిర్మిస్తున్నాం.

నాడు మొత్తం ఖర్చు రూ.58.98 కోట్లు మాత్రమే కాగా, నేడు 2014 నుండి ఇప్పటి వరకు రూ.530.18 కోట్లు ఖర్చు చేశాం. అంటే దాదాపు రూ.471.20 కోట్లు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నీటి సరఫరా మరియు మురుగునీటి శుద్ధికరణకు నిధులు వెచ్చించడం జరిగింది.

కొండపోచమ్మ సాగర్ నుండి.. మల్లన్న సాగర్ నుండి ఈ ప్రాంతానికి మంచినీరు అందేలా ప్రాజెక్ట్ లు రూపకల్పన చేయడం జరిగింది. దీని ద్వారా 2050 వరకు మంచినీటి శాశ్వత పరిష్కారం లభించనుంది.

B8B0CCAD FEE9 442A 8001 FD74FC065143

SAKSHITHA NEWS