SAKSHITHA NEWS

కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్

అల్లాపూర్ లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

…….

సాక్షిత : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు * పిలుపు మేరకు, *ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు * ఆదేశానుసారం రైతులకు మూడు గంటల కరెంటు చాలు అని వ్యాఖ్యానించిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాటలకు నిరసనగా అల్లాపూర్ డివిజన్ *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్దీన్ ఆధ్వర్యంలో పర్వత్ నగర్ చౌరస్తాలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది.

అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ రైతుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే
14 సంవత్సరాలు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు.

రైతే రాజుగా భావించిన కెసిఆర్ ప్రభుత్వంలో అన్నదాతకు అండగా నిలవాలని ఉచితంగా 24 గంటలు విద్యుత్ ను సరఫరా చేస్తుంటే, కేవలం మూడు గంటల విద్యుత్తు సరిపోతుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనడం రైతన్నలపై ఆయనకున్న మమకారం అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక ఆలోచన విధానాలకు నిదర్శనంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య కోఆర్డినేటర్ వీరారెడ్డి, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, నాగుల సత్యం, జ్ఞానేశ్వర్, జాహేద్ షరీఫ్ బాబా, సంజీవరెడ్డి, దేవరింటి మస్తాన్ రెడ్డి, టిఆర్ఎస్ రాజు, బద్రు నాయక్, సుంకన్న, విష్ణు, రాము యాదవ్, శివ, చాంద్ సాబ్, యోగి, సుమన్, వేణుగోపాల్, అగతముడి రమేష్, మహమూద్, రవీందర్ రెడ్డి, సంజీవ, మల్లికార్జున్, అబ్దుల్ హమీద్, అస్లం, జావీదుద్దీన్, మోయిన్, సలీం, ఎల్లం, బాలయ్య, శ్రీధర్, శేషారావు, శ్యాంసుందర్ రెడ్డి, సత్యనారాయణ, తులసి, శంకర్, కొండయ్య, బ్రహ్మం, సాయి రెడ్డి, అమరేందర్, శ్రీనివాస్ రెడ్డి, కోదండం, ఆదిరెడ్డి, కళ్యాణ్ నాయక్, కృష్ణ, రాజు, అశోక్, నజ్మా, లక్ష్మి, వెంకటమ్మ, సత్యమ్మ, శమ, పర్వీన్ సుల్తానా, సత్యవేణి, చిట్టెమ్మ, గీత, సునీత, అనురాధ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS