SAKSHITHA NEWS

సంబురానికి ముస్తాబైన తెలంగాణ భవన్…..

బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం మరియు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను పురస్కరించుకొని గండి మైసమ్మలోని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను, సభా స్థలిని జిల్లా అధ్యక్షులు, శంభీపూర్ రాజు , ఎమ్మెల్యేలు కెపి.వివేకానంద్ , మాధవరం కృష్ణారావు పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ సభ కార్యక్రమ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని, బహిరంగ సభ ఏర్పాట్లలో ఎటువంటి పొరపాటు జరగకుండా నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు సమన్వయం చేసుకోవాలన్నారు. అలాగే వాహనాల రద్దీని ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తూ వాహనదారులకు, కార్యక్రమానికి విచ్చేసే వారికి అటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.


SAKSHITHA NEWS