మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన… టిడిపి శ్రేణులు…
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం…
ఎన్టీఆర్ జిల్లా,మైలవరం మండలం, మైలవరం లోని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయం నందు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా టిడిపి శ్రేణుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు…
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంస్కరణ వాదిగా, అంటరానితనం అస్పృశ్యత నివారణకు అన్ని కులాలకు మతాలకు సామాజిక న్యాయమే ఎజెండాగా స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాడిన యోధులు మన జ్యోతిరావు పూలే అని అన్నారు…
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు యువత పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
