పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు
డా బూసి వెంకటస్వామికి డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారం
స్ధానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రత్తిపత్తి కళాశాల తెలుగు శాఖాధిపతి డా బూసి వెంకటస్వామి కి 2025 సంత్సరానికిగాను డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసినట్లు యస్ పి యల్ టి వో గౌరవ అధ్యక్షులు డా కె యస్ లక్ష్మణరావు,రాష్ట్ర అధ్యక్షులు డా నాగయ్య ఒక ప్రకటనలో తెలియజేసారు.దక్షిణాది రాష్ట్రాలలో అత్యంత ప్రతిభావంతులైన,వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిలో తమను ఎంపిక చేయటం ఆనందంగా ఉందని,తెలుగు భాష,సాహిత్యాలలో కృషి చేస్తున్నందుకుగాను ఈ సత్కారం అందుకోనున్నట్లు డా వెంకటస్వామి తెలియజేసారు.సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విఙ్ఞాన మందిరంలో ఈ నెల 31 వ తేదీన జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకోనున్నట్లు వారు తెలియజేసారు.డా బూసి వెంకటస్వామి ఇప్పటికే దాశరథి స్మారక పురస్కారం,గుర్రం జాషువా స్మారక పురస్కారం,గురజాడ స్మారక పురస్కారం,సిరి మంజిరి జాతీయ పురస్కారం,గురుబ్రహ్మ,ఆచార్య దేవోభవ అవార్డులతో పాటు 2024 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయ ఉగాది పురస్కారం,తన్నీరు కోటయ్య స్మారక జాతీయ పురస్కారం,2015 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డులను పొంది ఉన్నారు.వీరి పర్యవేక్షణలో ఇప్పటికే 12 మంది పిహెచ్ డి అవార్డులు అందుకున్నారు.వివిధ విశ్వవిద్యాలయాలలో,కళాశాలలో జరిగే జాతీయ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని సప్రమాణికమైన పరిశోధనా పత్రాలు సమర్పించారు.కర్నాటక సార్వత్రక విశ్వవిద్యాలయం-మైసూర్ ,బెంగుళూర్ విశ్వవిద్యాలయం,నార్త్ బెంగుళూర్ విశ్వవిద్యాలయం,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం,ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి వివిధ విశ్వవిద్యాలయాలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ మరియు ఎయిడెడ్ కళాశాలల్లో పాఠ్యాంశ నిర్ణాయక సభ్యులుగా వ్యవహారిస్తున్నారు.డా బూసి వెంకటస్వామికి డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారం ప్రకటించటం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డా తిరువీధుల రాజరాజేశ్వరి,వైస్ ప్రిన్సిపాల్ శ్రీ టి కృష్ణ,అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్ధినీ విద్యార్ధులు,తెలుగు సాహితీ, భాషాభిమానులు అభినందనలు తెలియజేసారు.
