ఏలూరు: పులిని చూస్తే ఇలా చేయండి
బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం రేంజి పరిధిలో పెద్దపులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి సూచించారు. పాదముద్రల ఆధారంగా పులి వచ్చిన దారినే వెనక్కి వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. ఎవరికైనా పులి కనిపిస్తే వెంటనే జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ అధికారికి 9505499141 నంబర్కు సమాచారం అందించాలని ఆయన కోరారు.

