30న స్విమ్స్ మెడికల్ కోర్సులకు కౌన్సిలింగ్
** ఆఫ్ లైన్ విధానం ద్వారా నిర్వహణ
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: స్విమ్స్ మెడికల్ యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 30వ తేదీ ఉదయం 9 గం. లకు ఆఫ్ లైన్ విధానంలో కౌన్సిలింగ్ జరుగుతుందని స్విమ్స్ వర్గాలు తెలిపాయి. శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కాలేజీ, స్విమ్స్ ప్రాంగణములో బి.పి.టి -4 సీట్లు, బి.యస్సీ అల్లైడ్ హెల్త్ సైన్సెస్ -1 సీటు కోర్సులకు మిగిలిన ఖాళీలకు (మొత్తం ఖాళీలు-05) కౌన్సిలింగ్ జరుపబడును. కౌన్సిలింగ్ లోపు రాబోవు అదనపు ఖాళీలను కూడా ఇందులో చేర్చబడును. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, పూర్తి ఫీజుతో హాజరు కాగలరు. ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రిజర్వేషన్ క్యాటగిరీ ప్రకారం కౌన్సిలింగ్ జరుపబడును. కౌన్సిలింగ్ కు ఇంతకు మునుపు దరఖాస్తు చేయని వారు అర్హులు కాదు.
మరిన్ని వివరాల కొరకు స్విమ్స్ వెబ్సైట్ ను సందర్శించగలరు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
