యువ భారత్ శక్తి ఫౌండేషన్ సహకారంతో చెక్ అందించిన : ఎమ్మెల్యే జారే
సాక్షిత : అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్న
వేంసూరు మండలం దిద్దుపూడి గ్రామానికి చెందిన జుంజునూరి వెంకటేశ్వరరావు ఇటీవల కరెంటు షాక్ కారణంగా తీవ్ర గాయాలతో హైదరాబాదులోని సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో చికిత్స కొనసాగించలేకపోతున్న విషయం తెలుసుకున్న యువ భారత్ శక్తి ఫౌండేషన్ సభ్యులు, దాతల సహకారంతో రూ.1,00,000/- ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వయంగా తమ చేతుల మీదుగా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఒకరికి ఒకరు అండగా నిలబడే భావన మనందరిలో పెరగాలన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇతరులకు ప్రేరణ కావాలన్నారు. ఆపదలో ఉన్న జుంజునూరి వెంకటేశ్వరరావు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన దాతలకు మరియు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిన యువ భారత్ శక్తి ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ భారత్ శక్తి ఫౌండేషన్ ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
