పదోతరగతి పూర్తిచేసుకొన్న పిల్లలకు Congratulations, SMR &SONS సొసైటీ అధ్యక్షులు సయ్యద్ జబివుల్లా

Spread the love

ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా !

ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. పరీక్ష ఫలితాలకై ఆసక్తిగా మరియు ఉత్కంఠ గా ఉన్న మీతో కొన్ని విషయాలను పంచుకొనేందుకు ఈ లేఖ. మీరందరూ పదవ తరగతి పరీక్షలు తమ శక్తిమేర బాగా చదివి రాసారు.అయితే ఫలితాల పరంగా మనం ఊహించిన విధంగా మరియు మనకనూలంగా ఉండవని గమనించాలి.ఏదేమైన మనం ఫలితాలను సానుకూలంగా తీసుకోవాలి.పరీక్షల కంటే మన జీవితం గొప్పది.ఇలాంటి పరీక్షలు మన జీవితంలోఎన్నో,ఎన్నెన్నో… మనం జీవితాంతం ఎదుర్కొంటు సానబడాలి.
ఉలిదెబ్బలు తినీ-తినీ ఎలాగైతే శిల శిల్పంగా మారుతుందో అలా.
ఫెయిలైన వారు దేనికీ పనికిరాడని,పరీక్ష తప్పినవారు సమాజంలో ఇమడలేరని అనుకోవడం చాలా పెద్ద తప్పు. పదవతరగతి 8 సార్లు తప్పిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచాన్ని ఏలలేదా.
9 సార్లు తప్పిన ఎ ఆర్ రెహమాన్ సంగీత ప్రంపంచాని ఉర్రూతలూగించలేదా…
చదువే సరిగ్గావంటపట్టని అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించలేదా…
మ్యాథ్స్ లో ఫెయిలైన థామస్ ఆల్వా ఎడిషన్ ప్రపంచం మెచ్చిన మేధావిగా కొనియాడబడలేదా….
ఇవన్ని కొన్ని ఉదాహరణలు మాత్రమే..
పరీక్షలలో తక్కువ మార్కులు,లేదా ఫెయిలైన విద్యార్థుల్లో ఒక కళాకారుడు(actor)ఉండచ్చు.వారికి లెక్కలతో పనిలేదు.
ఒక క్రీడాకారుడు (player) ఉండచ్చు.వారికి సైన్సు తో అవసరమే లేదు.
ఒక పెద్ద వ్యాపారి (business man)ఉండచ్చు.
వారికి సోషల్ మార్కులతో సంబంధమే లేదు.
ఒక గొప్ప సైనికుడు (soldier)ఉండచ్చు.
వారికి తెలుగు మార్కులు అవసరమే లేదు.
ఒక రాజకీయ నాయకుడు (politician) ఉండచ్చు.
వారికి మార్కులు అవసరమే లేదు.సమాజంలో తనకంటూ ఒక స్థానం, తనకు తానుగా తన కాళ్ళపై నిలబడాలంటే నీతి నిజాయితీ ఉంటే చాలని ,అలాంటి వారి ముందు సమాజమే సాగిలాపడుతుందనీ ఎన్నోసార్లు నిరూపణ అయ్యింది.
మీరందరూ చాలా మంచి పిల్లలు.ఈ ప్రపంచంలో ఎవ్వరితోనైనా పోటీపడగల శక్తి సామర్థ్యం మీకు ఉంది. ఇతరులతో పోల్చుకోవద్దు.మీ జీవితం మీదే.ముందు ముందు మీరేమి అవ్వాలను కుంటూన్నారో, చెయ్యాలనుకుంటున్నారో దానిపై శ్రద్ధ పెట్టండి. ఇష్టంతో చెయ్యండి. తప్పకుండా విజయం సాధిస్తారు.మా దృష్టిలో పనులన్నీ సమానమైనవే . ప్రతి పనిలో మీ నైపుణ్యం కనబడితే చాలు,మీరు విజయం సాధించినట్లే. ఈ అనంత విశ్వంలో మనం ఒక చిన్న భాగం మాత్రమే.అంతే.
మనుష్యులంతా ఒక్కటే , జాతి కుల మత బేధాలుండవు అని మనం బడిలో నేర్చుకున్నాం. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి . దయ ,జాలి ,కరుణ అనేవి ధనం కంటే చాలా గొప్పవని గుర్తుంచుకోండి. మనం ఏ విషయానికైతే బాధపడతామో అదే విషయానికి ఇతరులూ బాధపడతారు. సాటి మనుషులను నొప్పించకుండా బతకడానికి ప్రయత్నిద్దాం. యుద్ధం కంటే శాంతి ఎప్పటికీ గొప్పదే . అందుకే ఎవ్వరితోనూ గొడవ పడకండి.మంచి వ్యక్తిత్వం గల వారితో స్నేహం చేయండి.స్నేహం ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది .కలసి పని చేయడంలో, జీవించడంలో ఉండే ఆనందాన్ని పసిగట్టండి.ఇవన్నీ మీకు పదే పదే చెప్పిన విషయాలే. ఇల్లు వదలి బయటకు వెళ్తున్న పిల్లలకు అమ్మమాటగా మరోసారి గుర్తు చేస్తున్నాం అంతే .
ఇప్పటికే మీలో చాలామంది కాలేజీలను ఎంపిక చేసుకొని ఉంటారు.మిగిలిన వారు కూడా మీకు కావలసిన గ్రూప్ ,ఇంకా కాలేజీని నిర్ణయించుకోండి.మనం చదవ గలిగితే ఏ కాలేజీ అయినా ఒక్కటే . మీ తల్లిదండ్రులను , వయసులో పెద్దవాళ్ళను, ముఖ్యంగా మీకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించండి . అలాగే మీ కాలేజీ అధ్యాపకులను కూడా గౌరవించండి .వారు మీ చదువును సులభతరం చేస్తారు .ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అలవర్చుకొండి.ఎప్పటికీ మీ మూలాలు మర్చిపోకండి.
ఇక కొత్త తరగతి ప్రారంభించండి..
all the best
మీ ఉపాధ్యాయులందరూ మీ ఎదుగుదలను చూస్తూ ఆనందిస్తూ ఉంటారు. భవిష్యత్ లో మీకు ఎదురయ్యే ఏ సమస్యనైనా ఉపాధ్యాయులతో పంచుకోండి.మీకు సులభ పరిష్కారం దొరకవచ్చు…..చివరిగా ఒక్కమాట… కండల్లో బలం ఉంటే పది మందిని కొట్టగలం…
కాని గుండెల్లో మంచితనం ఉంటే పదివేలమంది మనస్సుల్లో నిలిచిపోగలమని తెలుసుకోండి.
రెండు విషయాల్లో మన వ్యక్తిత్వం బయటపడుతుంది.
1,మన దగ్గర ఏమిలేనప్పుడు మన ఓపిక.
2,మన దగ్గర అన్ని ఉన్నప్పుడు మన ప్రవర్తన.
పిల్లలూ …మీ అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ను ఆకాంక్షిస్తూ….
మీకు హృదయ పూర్వక

Related Posts

You cannot copy content of this page