SAKSHITHA NEWS

ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న సయ్యద్ జిలానీ & గోనుగుంట్ల కోటేశ్వరావు

_నరసరావుపేట పట్టణ పనసతోటలోని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మీరావలి నివాసంలో సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ సయ్యద్ జిలాని మరియు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు.

అలాగే ముఖ్య అతిథులు షేక్ మీరావలి ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష విరామించుకున్న వారికి పలహారాలను వడ్డీంచారు అనంతరం ఇఫ్తార్ విందుకు విచ్చేసినటువంటి ముస్లిం లకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసినారు.

అలాగే పనస తోట చుట్టుపక్కల గల మసీదులలోని ముస్లిం సోదరులందరూ ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో……….. షేక్ మీరా వలి కుమారుడు షేక్ షరీఫ్ సయ్యద్ షబ్బీర్ , షేక్ అదృూఫ్ , షేక్ అయ్యూబ్ , సయ్యద్ హమ్మద్ , మెడిశెట్టి రామారావు , షేక్ కరీముల్లా , షేక్ మౌలాలి , షేక్ ఖాజా మొదలగు వారు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app