శాసనసభలో సూర్యగా ఇంద్రసేన
హీరోగా పలు చిత్రాల్లో నటించి మెగాస్టార్ చిరంజీవి సైరా, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ధృవ చిత్రాలతో గుర్తింపు పొందిన ఇంద్రసేన శాసనసభ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్య అనే పవర్ఫుల్ పాత్రలో కథానాయకుడిగా కనిపించబోతున్నాడు ఇంద్రసేన. ఈ చిత్రంలో ఇంద్రసేనకు సంబంధించిన పవర్ఫుల్ లుక్‌ను దసరా పర్వదినాన విడుదల చేసింది చిత్రబృందం. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాపులర్ మ్యూజిక్ దర్శకుడు రవిబసుర్.కేజీఎఫ్-2 తరువాత రవిబసుర్ సంగీతం అందిస్తున్న మరో పాన్ఇండియా చిత్రం శాసససభ. ఐశ్వర్యరాజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణానంతర పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం విశేషాలను నిర్మాత షణ్ముగం సాప్పని తెలియజేస్తూ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రవిబసుర్ అందిస్తున్న సంగీతం, నేపథ్యసంగీతం మెయిన్‌పిల్లర్‌గా వుంటుంది. ఈ చిత్రంలో కథానాయకుడు ఇంద్రసేన పాత్ర ఎంతో విభిన్నంగా, డైనమిక్‌గా వుంటుంది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం వుంది అన్నారు. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్ ప్రతిష్టను పెంచేవిధంగా వుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి కథ- మాటలు: రాఘవేందర్‌రెడ్డి,
శాసనసభలో సూర్యగా ఇంద్రసేన
Related Posts
అనారోగ్యంతో బలగం మొగిలయ్య మృతి
SAKSHITHA NEWS అనారోగ్యంతో బలగం మొగిలయ్య మృతి వరంగల్ జిల్లా:బలగం సినిమాలో క్లైమాక్స్ లో ఆయన పాడిన పాట కోట్లాది మందిని ఏడిపిం చిన బలగం మొగిలయ్య ఇకలేరు. కొన్ని రోజులుగా కిడ్నీలు ఫేయిల్యూరై.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన…
ప్రభాస్ కాలికి స్వల్ప గాయం.. ప్రస్తుతం ఎలా ఉందంటే?
SAKSHITHA NEWS ప్రభాస్ కాలికి స్వల్ప గాయం.. ప్రస్తుతం ఎలా ఉందంటే? హైదరాబాద్: అగ్ర కథానాయకుడు ప్రభాస్ (Prabhas) కాలికి స్వల్ప గాయమైంది. సినిమా చిత్రీకరణలో భాగంగా ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నారు..…