సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
కుత్బుల్లాపూర్ మండలలంలోని సర్వే నెంబర్ 181,79,329,342,326,307,348/1 లలోని ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ్ నిర్మాణాలను గత కలెక్టరు ఆదేశాల మేరకు తొలగిస్తామని చెప్పి తొలగించక పోవడం వల్ల కబ్జాదారులు మరింతగా రెచ్చిపోయి ఉన్న భూమిని మాయం చేస్తున్నారని వెంటనే ఆ నిర్మాణాలను తొలగించాలని నేడు సీపీఐ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ మండలం తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. అదే విదంగా కబ్జాదారులు జిఓ నెంబర్ 58 కింద్ తప్పుడు పత్రాలను సృష్టించి దరఖాస్తు చేసుకుంటున్నారని పై సర్వే నంబర్లో చేసుకున్నవారకి పట్టాలు ఇవ్వొద్దని ఒకవేళ ఇస్తే సీపీఐ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అన్నారు. అదేవిధంగా పరికి చెరువు, రామరం, లాలసాహెబ్ గూడ,చిన్న కుంట, పాక్స్ సాగర్ తోపాటు పలు కుంటలను మట్టితో ఫుడ్చ్ నిర్మాణాలు చేస్తున్నారని అలాంటి వాటిని రక్షించి భవిష్యత్తు తరాలకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, మండల కార్యవర్గ సభ్యులు హరినాథ్ రావు,సదానంద్ లు హాజరయ్యారు.