పది రోజులకు ఒకసారి మాత్రమే మంచినీరు కుళాయిలు ద్వారా వస్తున్నాయి అంటున్న ప్రజలు వాటర్ ట్యాంకర్ తో గ్రామంలో నీటి సరఫరా..!
అధికారుల నిర్లక్ష్యం పై ప్రజల ఆగ్రహం ఇప్పటికైనా మంచి నీటి కష్టాలు తీరేనా…!
శ్రీశైలం మండలం నంద్యాల జిల్లా శ్రీశైలం మండల సున్నిపెంట గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పది రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు వస్తున్నాయని గత పది రోజుల నుండి స్థానిక ప్రజలు అధికారుల దృష్టి కీ తీసుకెళ్లినా ఫలితం లేదని వాటర్ మోటర్లు మరమ్మతులు చేయకపోవడం పై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో దాదాపు వేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పూర్తి చేయడం కోసం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన ఫలితం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల అధికారులకు సచివాలయ సిబ్బందికి పదేపదే చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు త్రాగు నీటి కోసం గ్రామంలో ప్రజలు బోర్ నీళ్లు కొనుగోలు చేస్తున్నారు కొంతమంది ఫిల్టర్ హౌస్ కు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు అసలే ఎండలతో ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు ఒకపక్క ఉక్కిరి బిక్కిరై అల్లాడుతుంటే సుండిపేంట గ్రామంలో మంచినీళ్లు సరైన టయానికి రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కోట్ల రూపాయల ఖర్చుతో ఓవర్ ట్యాంకులు పైప్ లైన్ వేసిన అధికారులు పనితీరు మాత్రం దొల్లగానే ఉందని స్థానిక ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మండల అధికారులు అడపాదడప వాటర్ ట్యాంకర్ తో ప్రజలకు నీరు అందిస్తున్న నీటి కష్టాలు అయితే వారికి తినడం లేదని ఆవేదం వ్యక్తం చేస్తున్నారు
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు