
సుధా బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ప్రారంభం
సూర్యాపేట లో సుధా బ్యాంక్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి ఐనా సందర్భంగా శుక్రవారం సుధా బ్యాంకులో రజతోత్సవ వేడుకలను బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ లు ప్రారంభించారు. బ్యాంకులోని మినీ ఆడిటోరియంలో జరిగిన వేడుకల కార్యక్రమం లో చైర్మన్ మీలా మహదేవ్ కేక్ కట్ స్వీట్స్ పంపిణీ చేశారు.సూర్యాపేట సర్వీస్ బ్రాంచ్ లో కొత్తగా నిర్మించిన స్ట్రాంగ్ రూమ్ లాకర్లను
ప్రారంభించి మొదటి లాకర్ ను భాగ్యశ్రీ వెంకన్న కు అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రజతోత్సవ వేడుకలు సందర్భంగా 3 రోజుల పాటు వేడుకలు నిర్వ హిస్తునట్లు ఇస్తున్నట్లు వారు తెలిపారు.అందులో భాగంగా ఈనెల 18 శనివారం పుష్య బహుళ పంచమి సందర్భంగా 22వ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు సూర్యాపేటలోని త్రివేణి గార్డెన్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐ ఆప్త ఫౌండర్ చిమట శ్రీనివాస్ పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విధ్వంసురాలు డాక్టర్ ద్వారం లక్ష్మీ ని సన్మానించనున్నట్లు తెలిపారు. పోపూరి పల్లవి చే కర్ణాటక గాత్ర కచేరి తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అందులో బాగంగా రజతోత్సవ, త్యాగరాజ ఆరాధన ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ పొనుగోటి నిర్మల డైరెక్టర్లు బొనగిరి భాస్కర్, కక్కిరేని చంద్రశేఖర్, శంకర్ లాల్, ఏపూరి శ్రవణ్ కుమార్, బానావత్ సుజాత, డాక్టర్ మీలా సందీప్ పుర ప్రముఖులు పెద్దిరెడ్డి రాజా ,తోట శ్యామ్ ,గుడిపూడి వెంకటేశ్వరరావు, అప్పంశ్రీనివాసరావు గాలి శ్రీనివాస్, భాగ్యశ్రీ వెంకన్న, తోట సత్యనారాయణ, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి ఫాస్ట్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, మేనేజర్లు సైదులు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
