
రాజకీయ ప్రక్షాళన చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు……….. తెదేపా నాగర్కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షుడు బొలమోని రాములు
29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ కు ఘన నివాళులు
*సాక్షిత వనపర్తి జనవరి 18 * ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న కాలంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పేరుతో ప్రాంతీయ పార్టీని స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లోనే ఎన్నికల్లో 200 పైగా సీట్లను సాధించి అధికారాన్ని చేపట్టడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి ఒక మహా కూటమిని ఏర్పాటు చేసి ఇటు రాష్ట్రంలోనూ అటు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రక్షాళన చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని నాగర్కర్నూల్ పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు బొలెమోని రాములు సీనియర్ నాయకులు గొల్ల వెంకటయ్యలు పేర్కొన్నారు శనివారం ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణాల్లోని హనుమాన్ టెక్డులో ని తెదేపా కార్యాలయం ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు తెదేపా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బోలెమోని రాములు మాట్లాడుతూ రాజకీయ అనుచితి సమయంలో ఉమ్మడి తెలుగురాష్ట్రంలో భూస్వాములు పెత్తందారుల కింద పాలేరుగా కూలీలుగా బానిసలుగా మగ్గుతున్న నిరుపేదల విముక్తి కోసం వారి కి కూడు గూడు గుడ్డ ఏర్పాటు నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల ముందుకు వచ్చారని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించడంతోపాటు అధికారం చేపట్టిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించిన అన్ని వర్గాల ప్రజలకు అందించిన మహోన్నత వ్యక్తి రామారావు అని నేటి రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పాలనకు సంబంధం లేకుండా పోయిందని పదేళ్లు పాలించిన టిఆర్ఎస్ పార్టీని ప్రస్తుతం పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ఆధ్వర్యంలో తెలంగాణలో తెదేపాకు పూర్వవైభవం రావడం ఖాయమని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు గొల్ల వెంకటయ్య అడ్వకేట్ షాకీర్ హుస్సేన్ కాగితాల లక్ష్మయ్య శ్రీనివాసులు యాదవ్, దస్తగిరి జరపోగు బాలరాజు ఫరూక్ బాలయ్య కొత్త గొల్ల శంకర్ గిరి కుమార్ నందమూరి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
