SAKSHITHA NEWS

Students should move forward with confidence that I can achieve

విద్యార్థులు నేను సాదించగలను అనే విశ్వాసంతో ముందుకు సాగాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”, వారి సతీమణి, సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్ పర్సన్ “డాక్టర్ మెతుకు సబితా ఆనంద్” వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థుల అభినందన సభ ఏర్పాటు చేసి పాఠశాలల్లో మరియు కళాశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ… ఘనంగా సన్మానించారు.

ముందుగా సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన చేసి, వందేమాతరం గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విద్యార్థుల్లోని నైపుణ్యతను గుర్తించి వారి ఆలోచనలకు ఆయువు పోస్తూ… ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో… విద్యార్థులకు ప్రేరణ కల్పిస్తూ… “సబితా ఆనంద్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

విద్యార్థి దశలో ఇంటర్ మీడియట్ దశ అత్యంత ప్రాముఖ్యమైనదని, విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాలను గుర్తించుకొని, కష్టమైన ఇష్ట పడి చదువుతూ… మీ జీవితాలను మిరే చక్కదిద్దుకొని చెడు వ్యసనాలకు గురి కాకుండా మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు.

వికారాబాద్ లోని పాఠశాలల్లో మరియు కళాశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన 162 మంది విద్యార్థులను ఘనంగా సన్మానించడం జరిగింది.

అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS