ప్రతి రోజు విద్యార్థులకు ఐదు ఆంగ్ల పదాలు నేర్పించాలి.
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి – నాణ్యమైన ఆహారం అందించాలి
అంగన్వాడీ కేంద్రాలలో పిల్లకు ఆట పాటలతో విద్యను భోదించాలి : కలెక్టర్
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట మండలం కాసారబాద్ గ్రామం లోని ప్రాధమిక పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ముందుగా పాఠశాల లోని విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లని పరిశీలించి విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉన్నదని వారి హాజరు శాతం పెంచేవిధంగా విద్యార్థుల తల్లితండ్రులతో మాట్లాడాలని ఉపాధ్యాయులకి సూచించారు.తదుపరి 3 వ తరగతి,4 వ తరగతి గదులలకి వెళ్ళి కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు.
కలెక్టర్ విద్యార్థులను ఆంగ్లంలో పలు ప్రశ్నలు, స్పెల్లింగ్ లు అడగగా విద్యార్థులు సమాధానం చెప్పగా సంతృప్తి వ్యక్తం చేసి విద్యార్థులను పలు ప్రశ్నలు అడుగుతు ఉత్సాహపరిచారు .ఆంగ్లం లో ప్రతి రోజు ఇలాగే ఐదు పదాలు నేర్పించాలని ఉపాధ్యాయులతో అన్నారు. తదుపరి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి స్టాక్ రిజిస్టర్ ని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. పిల్లలకు పోషక ఆహారం ను అందిస్తూ ఆట పాటలతో విద్యను బోదించాలని కలెక్టర్ అంగన్వాడీ టీచర్ కి సూచించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.అలాగే పాఠశాల అవరణాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది చే పరిశుభ్రం చేపించాలని పంచాయతీ కార్యదర్శి కి సూచించారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, ఉపాధ్యాయులు లింగయ్య, సైదా, పంచాయతీ కార్యదర్శి నవీన్,అంగన్వాడీ టీచర్ శైలజ, సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.