
అర్హులందరికీ ప్రభుత్వపథకాలు వర్తింప చేయకపోతే పోరాటాలు తప్పవు
వార్డు సభలు, గ్రామసభల పేరుతో నయవంచనకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం………. మాజీ మున్సిపల్ వై స్ చైర్మన్ వాకిటి శ్రీధర్
సాక్షిత వనపర్తి
ప్రజలకు వార్డు సభల గురించి సమాచారం అందించడం లో అధికారుల నిర్లక్ష్యం ప్రజాపాలన వార్డు సభ గ్రామసభలో భాగంగా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో స్థానిక 30 వార్డులో నిర్వహించిన వార్డు సభలో వార్డు కమిటీ చైర్మన్గా సభకు అధ్యక్షత వహించిన స్థానిక కౌన్సిలర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జరిగిన కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైందని గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు వృద్ధాప్య పింఛన్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల కొరకు ఇప్పటికే మూడుసార్లు దరఖాస్తు తీసుకున్నారన్నారని మళ్లీ కొత్తగా వార్డు సబల పేరుతో కొత్త నాటకానికి తెర లేపారని ఆరోపిస్తూ అర్హులందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు పింఛన్లు ఇవ్వాలని లేని ఎడల ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు అధికారుల నిర్లక్ష్యం వల్ల గతంలో నిర్వహించినటువంటి సర్వేలో దరఖాస్తుదారుల ఎంపికలో ఓపిక లేని అధికారులు సంప్రదించకుండానే అర్హులు కారని జాబితా తయారు చేశారు 152 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 40 మందిని మాత్రమే ఎంపిక చేశారని అసలైన పేద బడుగు బలహీన వర్గాలను విస్మరించారని సాక్ష్యంతో సహా గ్రామసభలో చూపించారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని పేద ప్రజల ఆర్తిని అభ్యర్థించాలని కోరారు
జరిగినటువంటి వార్డు సవల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో మున్సిపల్ కమిషనర్ పూర్తిగా విఫలమయ్యారని గతంలో ప్రతి వార్డులో ప్రజలందరికీ సమాచారం అందించడానికి టామ్ టామ్ చేయించి మైకు ద్వారా ప్రచారం చేసి గ్రామసభకు రావాలని వార్డు సభకు రావాలని ఆహ్వానించేవారు మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన కూడా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దరఖాస్తు చేసుకోలేని ప్రజలకు అన్యాయం జరుగుతే కమిషనర్ బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరించారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తో పాటు వార్డు అధికారి అరుణ్ కుమార్ అశోక్ కుమార్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎండీ ముక్తదార్ తిరుపతయ్య లక్ష్మి హిమబిందు మురళి రమన శివాజీ సభ్యులు పాల్గొన్నారు
