
- యాపర్ల పాఠశాల విద్యార్థులకుబూట్లు, టై మరియు బెల్ట్‌లు పంపిణీ చెసినా పూర్వ విద్యార్తి
- సాక్షిత వనపర్తి
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యపార్ల మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మొత్తం 110 మంది విద్యార్థులకు పూర్వ విద్యార్థి శ్రీమాసుం సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వార్డెన్ పనిచేస్తు వారి తండ్రి మహమ్మద్ వలి జ్ఞాపకార్థము పాఠశాల విద్యార్థులకు 110 షూ, టై, బెల్టుల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతు యాపార్ల పూర్వ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యపార్ల పూర్వ విద్యార్థుల సహకారంతో జిల్లాలో ఆదర్శ స్కూల్ గా నిలిచిందన్నారు.మాసుమ్ మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలలోని విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూల్ కు ధీటిగా ఉండాలనీ అందుకే షూస్ టై, బెల్టులు పంపిణీ చేస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హుస్సేన్, రైతు సంఘం నాయకుడు స్వరాజ్యం బాబురెడ్డి, వినోద్, ఉపాధ్యాయులు, వెంకటేశ్వర్లు మోహినొద్దీన్ ఈశ్వర్ రెడ్డి శ్రీధర్, బాలమ్మ, ఇందిర, రమేష్,ఆంజనేయులు, శివాని, అనూష, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
