రేవంత్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ కుత్బుల్లాపూర్ లో తీవ్ర నిరసన…

SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 13 at 11.47.37 AM

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం…

రేవంత్‌ను తమ పొలిమేరల్లోకి అడుగుపెట్టనివ్వమన్న రైతన్నలు…

తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దుండిగల్ గ్రామంలోని బస్ స్టాప్ సెంటర్ వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ‘రైతులకు మూడే గంటలు కరెంటు చాలన్న కాంగ్రెస్‌ పార్టీ, ఖబడ్దార్‌ రేవంత్‌రెడ్డి’ అని రైతులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌ పార్టీని, రేవంత్‌ను తమ పొలిమేరల్లోకి కూడా రానివ్వబోమని రైతన్నలు తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ‌లో రైతుల‌కు సీఎం కేసీఆర్ అండ‌గా నిలిస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టకొట్టేందుకు చూస్తుంద‌ని మండిప‌డ్డారు. ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యల‌ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నద‌ని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు స్వయంగా అనుభవించారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు శాశ్వతంగా దూరం చేశామని స్పష్టం చేశారు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ ను ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికే అన్నం పెట్టే రైతన్నలకు అన్యాయం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటిలు & డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

collector జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWScollector జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ గద్వాల: జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలక వర్గం పదవి…

SAKSHITHA NEWS

sitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSsitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క సాక్షిత : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క ప్రజా భవన్ లో బేగంపేట బస్తీ తావకాన సిబ్బంది మంత్రి సీతక్క కి హెల్త్ చెకప్…

SAKSHITHA NEWS

You Missed

collector జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

collector జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

sitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

sitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

bapatla బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

bapatla బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు

ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

You cannot copy content of this page