రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవు
ధాన్యం లారీకి ఎత్తిన తర్వాత రైతుకు సంబంధం ఉండదు
మిల్లర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు
కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తిస్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి
MLA మేఘారెడ్డి
సాక్షిత వనపర్తి :
వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు
- పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు*
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి రైతుల ధాన్యాన్ని లారీల లోకి ఎత్తిన తర్వాత రైతులకు ఎలాంటి సంబంధం ఉండదని ఏం సమస్యలున్నా కొనుగోలు కేంద్రంలోనే పరిష్కరించి ధాన్యాన్ని తీసుకోవాలని మిల్లర్లతో రైతులకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే చెప్పారు
కొనుగోలు కేంద్రాలలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని ఆయన అన్నారు
మిల్లర్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు
కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ సర్పంచ్ సిద్దయ్య, mpdo, mro, apm, మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరకు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
