గోదావరిఖనిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు తనిఖీలు..
25 కిలోల వాడిన వంటనూనె స్వాధీనం, చిప్స్ ధ్వంసం….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి గోదావరిఖని పట్టణంలోని పలు రెస్టారెంట్లు, ఆహార తయారీ యూనిట్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజీవ్ నగర్‌లోని ఓ ఆహార తయారీ యూనిట్‌ను తనిఖీ చేయగా, ఆలుగడ్డ చిప్స్‌తో పాటు ఇతర స్నాక్స్ తయారీలో ఒకే వంటనూనెను పదేపదే వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
వంటనూనె నాణ్యతను ఫుడ్ సేఫ్టీ శాఖకు చెందిన ప్రత్యేక టెస్టింగ్ మీటర్‌తో పరీక్షించగా, నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ రీడింగ్ నమోదైంది. దీంతో సుమారు 25 కిలోల వాడిన వంటనూనెను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. అదే నూనెతో తయారుచేస్తున్న చిప్స్‌ను కూడా అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
అదేవిధంగా, వినియోగించిన వంటనూనెను ఎలాంటి అనధికార సంస్థలు లేదా వ్యక్తులకు విక్రయించరాదని, యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తనిఖీల సందర్భంగా పలు ఆహార నమూనాలను సేకరించి రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు విశ్లేషణ కోసం పంపించారు. ప్రయోగశాల నివేదికలు అందిన అనంతరం ఆహార భద్రతా, చట్టం ప్రకారం అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
