ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

Sakshitha news

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలంలోని బాలెంల గ్రామంలో ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర అందించాలి, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైస్సార్, ఆర్డీఆర్ గార్ల ఆలోచన మేరకు ప్రతీ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి క్వింటాకు 500 బోనస్ అందిస్తున్నట్లు గుర్తు చేశారు. రైతులకు ఉచిత కరెంట్, రుణ మాఫీ, రైతు భరోసా, 500 బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. అందుకోసమే రాష్ట్రంలో సన్నాలు పండించే రైతులను ప్రోత్సహస్తుందని అన్నారు. దీనివల్ల మన రైతుల వద్దనే సన్నాలు కొని మళ్ళీ మనకే సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందువలన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్మాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదని కావున కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. తేమ 17 శాతం ఉండాలని, బస్తా 41 కేజీలు మాత్రమే తూకం వేయాలని ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామసాని రమేష్, మాజీ ఎంపిపి భూక్యా కాంత, మాజీ వైస్ ఎంపిపి రామసాని శ్రీనివాస్, దండు మైసమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్ గౌడ్, చందా దాసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగాని జనార్దన్, మాజీ కో ఆప్షన్ సభ్యులు రహ్మాతుల్లా, తాడూరి లింగయ్య, మాజీ సర్పంచ్ మారేపల్లి ప్రభాకర్, కంచర్ల వేణురెడ్డి, సరిపెల్లి రమణయ్య, మర్రి నారాయణ, పడిదల రమేష్, సరిపెల్లి మధు, మాజీ ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్లు, అధికారులు, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.