తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోయారనీ నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా రైతులకు కావాల్సిన కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని స్థితిలో ఉన్నారనీ ముఖ్యమంత్రికి రాజకీయాలు తప్ప రైతుల బాధలు పట్టించుకునే పరిస్థితిలో లేడన్నారు. కేసీఆర్ హయంలో సీజన్ మొదలయ్యేకంటే ముందే కావలసిన వనరులు సమకూర్చేవాళ్ళం. అధికారులు, మిల్లర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి కొనుగోలులో లోపాలు లేకుండా చూసేవాళ్ళం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్దతు ధర ఇవ్వకుండా రైతులను నష్టపోయేలా చేస్తున్నారనీ అన్నారు. కాంగ్రెస్ నాయకుల కమీషన్ల పేరుతో మిల్లర్లు రైతుల నుండి దోచుకుంటున్నారని, ఎమ్మెల్యేలు, మంత్రులకు ముడుపులు ముడితే చాలు అన్నచందంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ అంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వం 2300 మద్దతు ధర ఇస్తే మిల్లర్లు మాత్రం రైతులకు 1500 ఇస్తున్నా మిల్లర్లను ఎందుకు ప్రభుత్వం హెచ్చరించడం లేదు. రేవంత్ రెడ్డి హయాంలో వ్యవసాయం దండగ అనే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను నట్టేట ముంచారనీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం షరతులు లేకుండా రైతు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలనీ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కమీషన్లు, దోచుకుతినడం తప్పా కాంగ్రెస్ నాయకులు ఇంకో సోయి లేదనీ , గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక అభివృధి కుంటునపడిందనీ ప్రభుత్వంపై మండిపడ్డారు
