SAKSHITHA NEWS

గుర్తించిన 5 స్టాఫ్ లో బస్సులను ఆపండి.

డ్రైవర్లు కు సూచించిన సీఐ. బీమా నాయక్.

మార్కాపురం.

డివిజన్ డివిజన్ కేంద్రమైన మార్కాపురం పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి సలహాలు, సూచనలతో పట్టణంలో మరికొన్ని ప్రాంతాలలో నూతనంగా ఆర్టిసి బస్సు స్టాప్ లను గుర్తించడం జరిగింది. అందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో బస్సులను నిలపాలని సిఐ ఎం. భీమనాయక్ ఆర్టీసీ డ్రైవర్లకు సూచించారు. మంగళవారం ఉదయం స్థానిక ఆర్టిసి డిపో ఆవరణలో డ్రైవర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా 5 బస్ స్టాపులు గుర్తించామని వాటిలో ఆర్డీవో ఆఫీస్ ఎదుట, కోర్టు ఎదురుగా నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ వద్ద, పోస్ట్ ఆఫీస్ వద్ద, పాత బస్టాండ్ లోని గడియారం స్థంభం ప్రక్కన గల ఫూట్ వేర్ కాంప్లెక్స్ వద్ద, దోర్నాల బస్టాండ్ పాయింట్లు ఉన్నాయని అన్నారు. కావున నూతన బస్సు స్టాప్ పాయింట్లలో మాత్రమే వాహనాలను ఆపాలని డ్రైవర్లకు సూచించారు. నూతన స్టాపులు ద్వారా ట్రాఫిక్ ను నియంత్రించేందుకు వీలుంటుందని అన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ నరసింహులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS