SAKSHITHA NEWS

WhatsApp Image 2023 06 30 at 6.13.18 PM

సాక్షిత : తిరుపతి శ్రీనివాససేతు తుది దశ పనుల్లో భాగంగ రామానుజ సర్కిల్ నుండి ఆర్టిసి బస్ స్టాండ్ ను కలుపుతూ రైల్వే లైన్ పై రెండు మార్గాలను కలుపుతూ నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనుల్లో భాగంగా ఐరన్ గెడ్డెర్లను అమర్చే ప్రకియలో భాగంగ ట్రైల్ రన్ పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, రైల్వే అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సంధర్భంగా కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ బ్రిడ్జ్ ను అనుసంధానం చేసే ప్రకియలో అతి భారీ ఆరు ఐరన్ గెడ్డెర్లను ఏర్పాటు చేయడంతో దాదాపు శ్రీనివాస సేతు నిర్మాణం పూర్తి కావోస్తుందని, రైల్వే వారు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 వరకు పనులు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో, ఆరు గెడ్డెర్లు అమర్చేందుకు ఎంత సమయం తీసుకుంటుంది అనే అంచనాకు అక్కడున్న ఐరన్ గెడ్డెర్ ను కదిలించి ఓక అంచనాకు రావడం జరిగిందని, శనివారం నుండి పనులను వేగవంతం చేసి మరో పది రోజుల లోపు అన్ని పనులు అధికారులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, తిరుపతి రైల్వే స్టేషన్ అధికారులు కుప్పాల సత్యనారాయణ, కృష్ణ, సుబ్బారావు, ఆప్కాన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS