SAKSHITHA NEWS

స్టార్ చిల్డ్రన్ హైస్కూల్, పాల్వంచ

    స్టార్ చిల్డ్రన్ స్కూల్ లో 

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

పాల్వంచ: భద్రాద్రి జిల్లా పాల్వంచ మార్కెట్ ఏరియాలో గల స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరస్పాండ్ జి. భాస్కరరావు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి ని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం హర్షించదగిన విషయమని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే స్త్రీల విద్యాభివృద్ధికి నిరంతరం పాటు పడిన మహిళా చైతన్య మూర్తి అని, బాల్య వివాహాలు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి బలమైన ఉద్యమాన్ని నడిపించి మహిళోద్ధరణ కు విశేషంగా సావిత్రిబాయి పూలే కృషి చేశారని పేర్కొన్నారు. అనంతరం స్కూలు గౌరవ సలహాదారులు పి.పుష్పలత దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

    జి.భాస్కరరావు 
    కరస్పాండెంట్ 

స్టార్ చిల్డ్రన్ హైస్కూల్, పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
9866806532


SAKSHITHA NEWS